Don't Miss

టాలీవుడ్ లో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న హీరో యష్ ..ఎవరు ఈ యష్ ఎందుకు ఇంత క్రేజ్

By on December 15, 2018
FotoJet-6-4

హీరో యష్..ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమలో ఎక్కడ చుసిన ఇదే పేరు వినిపిస్తుంది. ఏ నలుగురు సినీ ప్రముఖులు కూర్చున్న ఇతగాడి గురించే మాట్లాడుకుతున్నారంట. పేరుకి కన్నడ హీరో అయినా యష్ గురించి తెలుగు నాట ఎందుకు ఇంత పెద్ద చర్చ నడుస్తుంది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మొత్తం చూసేయండి. మొన్న ఆ మధ్య రాజమౌళి మాట్లాడే వరకు యష్ అంటే ఎవరో మన తెలుగు వాళ్లకు పెద్దగా తెలియకపోయిన కన్నడ భాషలో యష్ ఒక స్టార్ హీరో, రాకింగ్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. బుల్లి తెర పై నంద గోకుల అనే సీరియల్ తో నటించడం మొదలెట్టిన యష్  మరి కొన్ని సీరియల్స్ నటించి హీరో రేంజ్ కి ఎదిగాడు. శశాంక్ అనే సినిమాతో మొదటి గా వెండి తెర పై అవకాశం సంపాదించి తనతో పాటు అదే సినిమాలో నటించిన రాధికా పండిట్ ని చాలా ఏళ్ళ పాటు ప్రేమించి 2016 లో పెళ్లి చేసుకున్నాడు.  డిసెంబర్ 2, 2018న యష్ రాధికా లకి ఒక కూతురు జన్మించింది.

1

2010 వరకు సోలో గా హిట్ కొట్టని యష్ ఆ తర్వాత మొదల్ సాల అనే సినిమాతో కమర్షియల్ గా సక్సెస్ అందుకున్నాడు. ఇక అప్పటి నుండి వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.  ఇప్పటికి కేవలం పదహారు సినిమాల్లో మాత్రమే నటించిన యష్ కన్నడ లో లీడింగ్ స్టార్ గా పేరు సంపాదికిన్చుకోవడం నిజంగా పెద్ద విషయం.
ఇప్పుడు 17 వ చిత్రం గా సౌత్ ఇండస్ట్రీ లో పలు భాషల్లో విడుదల అవుతునం కెజిఫ్ సినిమా గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు.  కేవలం 150 రోజుల్లో నిర్మాణం జరుపుకున్న కెజిఫ్ బాహుబలిని ని మించి ఉండబోతుంది అని ప్రచారం సాగుతుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21 న విడుదల కాబోతుంది. రాజమౌళి కూడా ప్రత్యేకంగా యష్ గురించి మాట్లాడం వల్ల తెలుగు సినిమా పరిశ్రమ దృష్టి యష్ పైన పడింది అని చెప్పుకోవచ్చు. అంతే కాదు తెలుగు లో కెజిఫ్ సినిమాను కైకాల సత్యనారాయణ తనయుడు విడుదల చేస్తుండటం విశేషం.  తమిళ్ లో మాత్రం హీరో విశాల్ కెజిఫ్ విడుదల చేయడం వల్ల తమిళ్ ఇండస్ట్రీ కూడా యష్ గురించి ఆసక్తికరంగా గమనిస్తుంది.

marriage

ఇక ఇప్పటికే నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కించుకున్న యష్ ‘కేజీఎఫ్’తో మరో అవార్డును తన ఖాతాలో వేసుకుంటాడని అంతా అంటున్నారు. యష్ ని చుసిన వారంతా తెలుగులో ప్రభాస్ ని చూస్తున్నట్టే ఉంది అంటూ పొగుడుతున్నారు. కన్నడ లో లీడ్ ఆక్టర్ గా యష్ కొనసాగుతున్న కూడా అతడి తండ్రి మాత్రం బస్సు డ్రైవర్ గా ఇప్పటికి కష్టపడుతుండటం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. యష్ భార్య కూడా హీరోయిన్ అయినా వారు సాధారణ జీవితాన్నే గడుపుతున్నారు.
సినిమా మరియు వ్యక్తిగత విషయాలు ఎలా ఉన్న యష్ పైన ఆ మధ్య హత్య యత్నం జరిగి కన్నడ ఇండస్ట్రీ ని ఒక్కసారిగా షాక్కి గురి చేసింది. బద్ద శత్రువులుగా పేరు గాంచిన సైకిల్ రవి, కోదండరామ అనే ఇద్దరు రౌడీ షీటర్లు యష్ ని చంపడం కోసం చేతులు కలపడం ఇటు సినిమా ఇండస్ట్రీ ని అటు యష్ అభిమానులను కలవరానికి గురి చేసింది.

2

ఎందుకు హత్య యత్నం చేయబోయారనే విషయాలు వెలుగులోకి రాకపోయినా ఈ సమస్య ఇంకా సర్దు మణిగింది లేక మల్లి అలాంటి ఘాతుకానికి ఒడిగట్టే పరిస్థితులు ఉన్నాయా అనేది ప్రశ్నార్ధకంగా మిగిలిపోయింది. ఏది ఎలా ఉన్న యష్ మాత్రం తన సినిమాలతో బిజీ గా ఉంటూనే భారీ రాధికా తో కలిసి యష్ మార్గ ఫౌండేషన్ ని స్టార్ట్ చేసి సొసైటీ కోసం పాటు పడుతున్నాడు. ఇదండీ సంగతి యష్ కెజిఫ్ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అల్ ది బెస్ట్

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *